Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య చరిత్రలో అద్భుతం - స్టెమ్స్ సెల్స్‌తో ఎయిడ్స్‌ నయం

వైద్య చరిత్రలో అద్భుతం - స్టెమ్స్ సెల్స్‌తో ఎయిడ్స్‌ నయం
, శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (10:27 IST)
వైద్య చరిత్రలో సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌కు మందు లభించింది. స్టెమ్ సెల్స్‌తో ఎయిడ్స్‌కు నయం చేయవచ్చని అమెరికాకు చెందిన ఓ మహిళా వైద్యురాలు నిరూపించారు. పైగా, తొలిసారి ఓ మహిళను ఎయిడ్స్ నుంచి విముక్తి చేశారు. 
 
గత కొన్నేళ్లుగా ప్రపంచాన్ని ఎయిడ్స్ వ్యాధి భయపెడుతోంది. దీనిబారినపడి అనేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎయిడ్స్‌కు మందు కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన వైద్య బృందం ఎయిడ్స్‌కు మందు కనిపెట్టింది. 
 
మూలకణాల మార్పిడి (స్టెమ్ సెల్స్) చికిత్స ద్వారా ఎయిడ్స్‌ను నయం చేయవచ్చని నిరూపించారు. ఓ మహిళను ఎయిడ్స్ వ్యాధి నుంచి పూర్తిగా రక్షించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ నుంచి సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్‌గా ఈ మహిళ ఖ్యాతికెక్కారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన