Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రే సీల్స్‌పై లైంగిక భాగస్వామి చప్పట్లతో సంకేతాలు..

Advertiesment
గ్రే సీల్స్‌పై లైంగిక భాగస్వామి చప్పట్లతో సంకేతాలు..
, శనివారం, 13 మార్చి 2021 (14:35 IST)
grey seal
సముద్ర జీవి.. గ్రే సీల్స్‌పై జరిగిన అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. లైంగిక భాగస్వామికి చప్పట్లతో సంకేతాన్ని ఇచ్చుకుంటాయట. సంగమించాలనుకున్న సందర్భంలో ఈ సీల్స్ చప్పట్లతో సహచరికి సంకేతాలిస్తాయట. ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం గ్రే సీల్స్‌పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
 
సీల్స్‌లో సాధారణంగా మగజీవి 150 నుంచి 300 కిలోల బరువుతో రెండున్నర మీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఆదేవిధంగా ఆడ జీవి 100 నుంచి 200 కిలోల బరువుతో రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. వీటి దేహం కింద ఉదర భాగంలో ముందువైపు ఒక జత పూర్వాంగాలు, వెనుకవైపు ఒక జత చరమాంగాలు ఉంటాయి. 
 
అయితే, నీటిలో ఈదడానికి తోడ్పడే ఈ తెడ్లలాంటి నిర్మాణాల్లో పూర్వాంగాలను గ్రే సీల్స్ చేతుల్లా ఉపయోగించి చప్పట్లు కొడుతాయట. సాధారణంగా జంతుప్రదర్శన శాలల్లోని నీటిలో ఉండే సీల్స్ కూడా చప్పట్లు కొడుతాయి. అయితే సందర్శకుల ఆనందం కోసం జూ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో వాటికి ఆ చప్పట్లు కొట్టడం అనే లక్షణం ఒంటబడుతుంది. కాబట్టి అందులో వింతేమీ లేదు.
 
కానీ సముద్రాల్లోని గ్రే సీల్స్‌కు ఎలాంటి శిక్షణ లేకపోయినా చప్పట్లు కొడుతాయి. అదీ నీటి లోపలిభాగంలో ఎలాంటి గాలి లేకపోయినా, తుపాకీ పేలినంత పెద్దగా శబ్దం వచ్చేలా చప్పట్లు కొడుతాయట. సాధారణంగా కమ్యూనికేషన్ కోసం సీల్స్ రకరకాల శబ్దాలు చేస్తాయట. 
 
అయితే ఈ చప్పట్లు కొట్టడం అనే లక్షణం కూడా కమ్యూనికేషన్‌ కోసమే అయినా వాటి భాషలో దానికి అర్థం వేరేనట. చప్పట్లతో చేసే ఈ కమ్యూనికేషన్‌కు తాను సంగమం కోసం తహతహలాడుతున్నా అనే సంకేతం దాగి ఉందట. ఈ చప్పట్ల ద్వారా మగ గ్రే సీల్‌ తన పరిసరాల్లో ఉన్న సీల్స్‌కు రెండు రకాల సందేశాలిస్తుందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20 వేలకు పైగా కరోనా కేసులు-దేశంలో మళ్లీ లాక్ డౌన్