Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో బరితెగించిన దండగుడు.. ఏడుగురిని కాల్చి చంపేశాడు...

Advertiesment
gun shot

వరుణ్

, మంగళవారం, 23 జనవరి 2024 (09:18 IST)
అమెరికా దేశంలోని చికాగో నగరంలో దారుణం జరిగింది. ఇల్లినాయిస్ నగరంలో ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. రెండు ఇళ్లపై కాల్పులు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పుల తర్వాత దుండగుడు పారిపోయాడు. పరారీలో ఉన్న దుండగుడి కోసం అగ్రరాజ్య పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. 
 
నగరంలోని జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్డులో ఉన్న2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగింది. నిందితుడిని రోమియో నాన్స్‌‍గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు చనిపోయారని జోలియట్ పోలీస్ చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించాడు. 
 
నిందితుడు నాన్స్ (23) కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తున్నాడని తెలిపారు. ఎరువు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ విభాగం విజ్ఞప్తి చేస్తూ అప్రమత్తం చేసింది. 
 
నాన్స్‌కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా, అగ్రరాజ్యం అమెరికాకు కాల్పుల ఘటనలతో వణికిపోతుంది. ఈ కాల్పుల్లో గణనీయ సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యేడాది మొదటి మూడు వారాల్లో 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయోధ్య రామాలయం వద్ద కిక్కిరిసిన భక్తజనం.. వేకువజామున 3 గంటలకే...