Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

300 ఏళ్ల క్రితం చనిపోయింది కానీ కళ్లు తెరిచి చూసింది.. ఎలా సాధ్యం..?

300 ఏళ్ల క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూసింది. అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు. కానీ ఓ పర్యాటకుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళి

Advertiesment
300 Year Old Child Saint Santa Inocencia Open Eyes In Front Of Tourists
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:07 IST)
300 ఏళ్ల క్రితం చనిపోయింది.. కానీ ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచి చూసింది. అందరూ షాక్ అయ్యారు. భయంతో వణికిపోయారు. కానీ ఓ పర్యాటకుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. 300 సంవత్సరాల క్రితం శాంతా ఇనోసెన్సియా అనే చిన్నారి ఉండేది. నిత్యం ఏసు క్రీస్తు ధ్యానంలో ఉండే ఆమె ఓ రోజు నన్‌గా మారిపోవాలని నిర్ణయించుకుందట. 
 
కానీ ఆమె నన్‌గా మారిపోవడం ఆమె తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని తెలియడంతో.. ఆమె ఇల్లు వదిలి వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో తండ్రి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో క్రీస్తు భక్తికి చిహ్నంగా ఇనోసెన్సియా భౌతిక కాయాన్ని చర్చిలోనే ఉంచాలని మత పెద్దలు నిర్ణయించారు. శరీరం కుళ్లిపోకుండా వివిధ రసాయనాలతో గాజు పెట్టెలో ఉంచారు. అయితే తాజాగా ఆ మృతదేహం కళ్లు తెరిచి చూసింది. 
 
వీడియోలో ఆమె కళ్లు తెరస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇనోసెన్సియా కళ్లు తెరిచి చూసేందుకు గల స్పష్టమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మందుబాబులు చుక్కేయట్లేదు.. అమ్మకాలు తగ్గాయోచ్..