సాధారణంగా మట్టి, ఇసుకలో దొరికే రంగు రాళ్లు, ఆల్చిప్పలు, గవ్వలను సమకూర్చుకోవడంలో మహిళలు ఎంతో ఆసక్తిని కనపరుస్తుంటారు. తమ తమ అభిరుచికి తగ్గట్టే వాటితోనే ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.
మిరుమిట్లు గొలిపే వివిధ రంగుల్లో గులకరాళ్లు, పూరేకలు, నీటిలో వేయగానే పెద్దవయ్యే స్నేక్, వాటర్ బబుల్స్‌లాంటివి ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
వీటిని పారదర్శకమైన ప్లాస్టిక్, గాజు సీసాల్లో భద్రపరచి ఉంచితే ఇంటికి ప్రత్యేకమైన శోభ చేకూరుతుంది. ఓ పాత్రలో నీళ్లుపోసివుంచి అందులో వివిధ రంగుల్లోనున్న గులకరాళ్లను వేసివుంచితే చూసేందుకు అందంగా కళ్ళకు ఇంపుగాను ఉంటాయి.