Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లవర్‌ వాజ్‌లో పువ్వులు ఎలా అలంకరించాలంటే..!?

Advertiesment
ఫ్లవర్ వాజ్
, బుధవారం, 18 ఏప్రియల్ 2012 (17:07 IST)
WD
ఫ్లవర్‌ వాజ్‌లో పువ్వులు అలంకరించాలంటే సూర్యోదయానికి ముందే పువ్వులు కోసి పెట్టుకోవాలి. వీటిని కోసేటప్పుడు పదునైన చాకును ఉపయోగించాలి. నీటితో కడిగి ఫ్లవర్‌వాజ్‌లో ఫ్లవర్‌లు అలంకరించాలి.

* పువ్వులతో పాటు మధ్య మధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్ళలో మునగ కూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్ వాజ్ అందంగా ఉంటుంది.

* బాగా వికసించిన ముదురు రంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.

* ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకే చోట కాకుండా మ్యాచింగ్ వుండేలా చూడాలి.

* పువ్వుల రంగు గది కర్టెన్ రంగుతో మ్యాచ్ అయితే ఆనందానుభూతి ఎక్కువ.

* ఫ్లవర్‌వాజ్ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్ళల్లో కాస్తంత ఉప్పు కలపాలి. పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి.

* ఫ్లవర్‌వాజ్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి.

* ఇంట్లో ఇండోర్‌ప్లాంట్స్, మనీప్లాంట్స్, కొన్ని రకాల క్రోటన్ మొక్కలు కుండీలో వేసి గదుల్లో డ్రాయింగ్ రూంలో అలంకరించుకోవచ్చు.

* మొక్కలు మనకు ఆక్సిజన్ ప్రసాదించి, మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుని మనకు ఎంతో మేలు చేస్తాయి. తద్వారా మనకి మంచి ఆరోగ్యకర వాతావరణం లభిస్తుంది.

* వేప, యూకలిప్టస్ మొదలైనవి క్రిమి సంహారిణిగా ఉపయోగపడతాయి. కనుక స్థలం ఉన్నవారు బద్ధకించకుండా మొక్కలు పెంచడం వల్ల ఆదాకి ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం. మొక్కలకి నీరు పోయడం వల్ల శరీరానికి వ్యాయామం కూడా.

Share this Story:

Follow Webdunia telugu