Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగ చెట్టు మందుతో శిరోవాతం మటుమాయం

Advertiesment
మంగ చెట్టు మందుతో శిరోవాతం మటుమాయం
, సోమవారం, 5 నవంబరు 2018 (10:46 IST)
చాలా మంది పేను కొరుడు సమస్యతో బాధపడుతుంటారు. ఈ పేను కొరుడు సమస్య ఉన్నట్టయితే తలలో ఎక్కువగా దురద పుట్టడంతో పాటు.. వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యకు చక్కటి మందు ఉందని గృహ వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ మంగ చెట్టు మందుతో కలిగే లాభాలేంటో పరిశీలిద్ధాం.
 
* తల మీద పేను కొరికిన ప్రదేశంలో మంగ పూలతో రుద్దితే, ఆ చోట మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి.
* మంగ చెట్టు కాండపు బెరడును ఎండించి చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని కొంచెం నువ్వుల నూనెలో కలిపి, నొప్పిగా ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి.
* వేరు బెరడుకు సమానంగా శీకాయ పొడినిగానీ, కుంకుమ కాయ పొడినిగానీ కలిపి దానితో తలస్నానం చేస్తే చుండ్రు పోవడంతో పాటు వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
* మంగచెట్టు బెరడునుగానీ, వేరు బెరడునుగానీ, మెత్తగా నూరి కుంకుడుకాయలా తలకు రుద్దితే, నేత్రవ్యాధులు, తలనొప్పి తగ్గుతాయి. పేలు చనిపోతాయి. ఇది మెదడుకు, కళ్లకు చలువ చేయడంతో పాటు శిరోవాతం తగ్గిపోతుంది.
* మంగకాయ, అతి మధురం ఈ రెంటినీ సమానంగా తీసుకుని, చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే ఆస్తమా, ఎలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యలు తగ్గిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలం, శీతాకాలంలో అల్లంను ఎందుకు వాడాలో తెలుసా?