Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యానికి అల్లం... ఎలా ఉపయోగపడుతుంది...

అల్లం మసాలా దినుసుగా వాడడం వలన ఆహారానికి రుచి, సువాసన కలగడమే కాకుండా శరీరానికి మందుగా కూడా పనిచేస్తుందని శాస్తజ్ఞ్రులు నిర్ధారించారు. ముఖ్యంగా అల్లం ఏ రూపంలో వాడినా పైత్యాన్ని తగ్గిస్తుంది.రక్తం గడ్డ కట్టటాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు, పదార

Advertiesment
ginger health benefits
, శుక్రవారం, 13 మే 2016 (21:31 IST)
అల్లం మసాలా దినుసుగా వాడడం వలన ఆహారానికి రుచి, సువాసన కలగడమే కాకుండా శరీరానికి మందుగా కూడా పనిచేస్తుందని శాస్తజ్ఞ్రులు నిర్ధారించారు. ముఖ్యంగా అల్లం ఏ రూపంలో వాడినా పైత్యాన్ని తగ్గిస్తుంది.రక్తం గడ్డ కట్టటాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు, పదార్థాలను అదుపుచేయటం, కీళ్లవాపులు, నొప్పులు, తగ్గించుకోవడం, సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించటం వంటి వాటిలో అల్లం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.
 
గృహ వైద్యంలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రకాలుగా అల్లాన్ని వాడవచ్చు. ప్రపంచమంతటా కూడా ఆహారంలో సుగంధానికి ఉపయోగిస్తారు. సాస్‌లు, సలాడ్లు, జామ్‌లు, పచ్చళ్లు, ఊరగాయలు, మిఠాయిలు, బేకరీ వస్తువులు, వీటన్నింటి తయారీలో అల్లాన్ని వినియోగిస్తున్నారు. అల్లాన్ని ఎండబెట్టి పొడిచేసి కొన్ని పదార్థాలలో వాడుతు న్నారు. అల్లాన్ని నేరుగా వాడటమే కాకుండా దీని నుంచి లభించే పదార్థాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అల్లం నుంచి తీసిన ఒలిమొరెజిన్‌ చిక్కని నూనె వంటివి అల్లం ఘాటుకు కారణభూతం. దీని నుంచే జింజెరిన్‌ అనే ఎసెన్స్‌ను తయారు చేస్తారు.
 
ఈ ఎసెన్స్‌ కాన్డ్‌పుడ్‌ ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాక జీర్ణకోశాన్ని,మెదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. అందువలన ఎక్కువగా జీర్ణశక్తికి తోడ్పడే మందులలో, టానిక్‌లలో మాత్రలలో అల్లము అవసరమవుతున్నది. మత్తు పదార్ధాలైన జింజర్‌ బీర్‌, జింజర్‌వైన్‌, జింజర్‌పల్‌ తదితర పరిశ్రమలలో అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు .
 
అల్లం నుంచి తయారైనదే శొంఠి.అల్లం పొట్టు తీసి సున్నపునీటిలో శుద్ధిచేసి ఎండబెడితే శొంఠిగా రూపాంతరం చెందుతుంది. తేమ తొలగినందున శొంఠి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. సంస్కృ తంలో అల్లాన్ని మహౌశధ అనేవారు కాని రానురాను పర్యాయ పదాలైనా ఆర్థ్రకం, శృంగిభేరి అని పిలుస్తున్నారు. శాస్త్రీయ నామం జింజిబర్‌ అఫిసినాలిస్‌. దీని నుంచే ఆంగ్లంలో జింజర్‌ అనే పదం పుట్టింది. హిందీలో అద్రక్‌ అంటారు. జింజిబరెని కుటుంబం. పసుపు, అల్లం తోబుట్టువు. స్వస్థలం దక్షిణ, తూర్పు ఆసియా. బహువార్షిక గుల్మం. మనం వాడే అల్లం ఈ మొక్క భూగర్భకాండమైన కొమ్ము. కొమ్ము నాటిన 8 నెలలకు కోతకు వస్తుంది.
 
ఈ కొమ్ము ద్వారానే ప్రవర్థనం చెందుతుంది. సాధారణంగా వచ్చే పడిశం, దగ్గు, ఉబ్బసంతో కూడిన ఆయాసం వంటి వాటిని అల్లంగాని, శొంఠినిగాని వాడి తేలికగా తగ్గించుకోవచ్చు. తల, గొంతు వంటి నొప్పులను శొంఠిని నీటిలో అరగదీసి పైపూతగా వాడడం అనాది నుంచి ఉంది. శొంఠిని కాఫీలో గాని, టీలో కాని కలిపి సేవిస్తే జలుబు భారం, తలనొప్పి తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు తగ్గాలా... అల్పాహారంలో కోడిగుడ్డు ఆరగించండి!