పొడి దగ్గు ఏ రుతువులోనైనా వస్తుంటుంది. ఇలా పొడి దగ్గు బారిన పడే వారికి కఫం రాదు. కేవలం దగ్గుతోనే బాధపడుతుంటారు.
ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి 15-20 గ్రాములు మరియు మిరియాలు కలుపుకుని వేడి చేసుకోండి. వేడి చేసేటప్పుడు మిరియాలు బాగా ఉడికి పైకి తేలుతాయి, అప్పుడు వాటిని కిందకు దించి చల్లబరచండి. ఇందులో 20 గ్రాముల కలకండను కలుపుకోండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మిరియాలను నమలండి.
ఇలా చేసిన తర్వాత ఓ గంటపాటు ఏమీ తినకండి, త్రాగకండి. ఇలా రెండు రోజులపాటు సేవించండి. దీంతో దగ్గునుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.