పురుషులకు సెక్స్ టానిక్ అరటి పండు
సెక్స్ శక్తిని పెంచగలగిన ఆహారపదార్థాలలో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు రూపం పురుషాంగాన్ని పోలి ఉండటం వల్ల అది పురుషుడికి సెక్స్ శక్తిని ఇస్తుందని పూర్వం అనుకునేవారు. దాని ఆకారం సంగతి ఎలా ఉన్నా అరటిలో ఉన్న విటమిన్లు సెక్స్‌కు టానిక్‌లా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి ఉన్నాయి. వీటితోపాటు కీలేటింగ్ లవణాలు, బ్రోమెలిన్ ఎంజైములు అరటిలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ పురుషుడి సెక్స్ శక్తిని పెంచుతాయని తేలింది. మధ్య అమెరికాలో ఎర్రటి అరటిపండు రసాన్ని సెక్స్ సామర్థ్యాన్ని పెంచే టానిక్‌గా సేవిస్తారు. ఇక మన దేశం విషయానికి వస్తే... అరటిని సంతానాన్ని ఇచ్చేదిగా భావిస్తారు.