లావెండర్ ఆయిల్ రెండు చుక్కలు, లెమన్ ఆయిల్ ఒక చుక్క, యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు, చామొమైల్ ఆయిల్ రెండు చుక్కలు, నార్మల్ ఆయిల్ ఒక టీ. తీసుకుని... ఒక బాటిల్‌లో పోసి మిక్క్ చేసుకోవాలి. ఇది నొప్పులను సమర్థవంతంగా నివారిస్తుంది కాబట్టి, నొప్పి ఉండేచోట ఈ మిశ్రమాన్ని మర్దనా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేగాకుండా, ఇదే మిశ్రమాన్ని చర్మానికి అప్లయి చేయటంవల్ల చర్మం నవ యవ్వనాన్ని సంతరించుకుంటుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఈ మిశ్రమంతో మర్దనా చేయించుకోవాలంటే మాత్రం మసాజ్ ఎక్స్‌ఫర్ట్‌తో చేయించుకోవటం అన్నివిధాలా ఉత్తమమంటున్నారు వైద్యులు.