కడుపులో వికారం... వేడి చేస్తే పచ్చకర్పూరం తమలపాకులో....
, బుధవారం, 23 అక్టోబరు 2013 (20:48 IST)
ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఇప్పుడు ఏదో ఓ మాత్ర మింగేసి దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి పట్టించుకోకపోవడం ఇపుడు మామూలయిపోయింది. ఐతే సాధ్యమయినంత వరకూ ఇంగ్లీషు వైద్యాన్ని ఇదివరకు మన పెద్దవారు దూరంగా ఉంచేవారు. ఎక్కువగా పెరటి వైద్యంపై ఆధారపడేవారు. ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోయాయి. వాటిని మళ్లీ మీకు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, కడుపులో వికారం వంటి సమస్యలకు లోనవుతుంటారు. అలాంటప్పుడు సరకుల అంగడిలో దొరికే పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకుని దానికి కొంచెం మంచి గంధం కానీ, వెన్నను కానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి దాని రసాన్ని మింగితే వేడి తగ్గుతుంది. అంతేకాదు... కళ్లు బైర్లు కమ్మడం, తల తిరగడం, కడుపులో వికారం, అతిగా శరీరానికి చమట్లు పట్టడం వంటివన్నీ తగ్గిపోతాయి. ఇంకా కంటికి సంబంధించి సమస్యలు... కళ్లు ఎరుపెక్కడం, కళ్ల వెంట నీరు కారడం, తలనొప్పి వంటివన్నీ పచ్చకర్పూరం తీసుకుంటే తగ్గిపోతాయి. మూత్రం పోసేటపుడు మంట, చీము, సుఖవ్యాధులు ఉన్నవారు సైతం పచ్చకర్పూరానికి గంధంతో కలిపి తీసుకుంటే బాధలు నివారించబడతాయి.