Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లి.. చేతులు మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు.. హాలీవుడ్ నటి

బెడ్రూమ్‌లోకి లాక్కెళ్లి.. చేతులు మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు.. హాలీవుడ్ నటి
, శుక్రవారం, 24 జనవరి 2020 (13:11 IST)
హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా తనపై జరిగిన దారుణాన్ని వెల్లగక్కింది. 25ఏళ్ల క్రితం దర్శకుడు హార్వే వెయిన్ స్టీన్‌ తనను అతి దారుణంగా అత్యాచారం చేశాడంటూ..  కోర్టు హాలులోనే భావోద్వేగానికి లోనైంది.

వివరాల్లోకి వెళితే.. 1994లో సినిమా షూటింగ్ లేటు కావడంతో డైరక్టర్ హార్వే తన కారుతో దింపుతానని ఎక్కించుకున్నాడని, న్యూయార్క్‌లోని మహట్టన్‌ అపార్ట్‌మెంట్‌ దగ్గర దింపేసి వెళ్లిపోయాడని తెలిపింది. తర్వాత తాను నిద్రించేందుకు సిద్ధమవుతుండగా, డోర్ తలుపులు ఎవరో కొట్టడంతో తీసానని.. అతని ప్రవర్తనలో తేడా కనిపించిందని తెలిపింది. 
 
ఆ సమయంలో తన శరీరం మొత్తం వణుకు పుట్టింది. ఎంత ప్రయత్నించినా అతడి కామచర్యను అడ్డుకోలేకపోయానని వాపోయింది. అతనిని తీవ్రంగా ప్రతిఘటించానని.. ఎంత చెప్పినా వినకుండా తనను బెడ్రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి..  తన చేతుల్ని మంచానికి కట్టేసి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టు హాలులో అన్నా భావోద్వేగానికి లోనైంది. నిజంగా ఆ రాత్రి తనకు కాళరాత్రిగా మిగిలిపోయింది. 
 
వెయిన్‌స్టీన​ చేసిన పని తన జీవితంలో ఒక చేదు ఘటనగా మిగిలిపోయింది. ఇన్ని సంవత‍్సరాలైనా ఆ రాత్రి జరిగిన ఘటన ఇప్పటికి గుర్తుందని అన్నాబెల్లా సియోరా చెప్పుకొచ్చింది. కాగా అన్నా వాదనల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తేల్చడానికి శుక్రవారం సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ను రప్పించాలని కోర్టు ఆదేశించింది. నటి అన్నాబెల్లాను దారుణంగా రేప్‌ చేశాడన్న ఆరోపణలతో అప్పట్లోనే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. 
 
కానీ ఇంతవరకు ఈ కేసులో సరైన నిజాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి వాదనకు వచ్చిన కేసులో అన్నా తన వాదనలు వినిపించారు. అన్నాతో పాటు వెయిన్‌స్టీన్‌ 80 మందిని లైంగికంగా వేదించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందులో హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ పేరు కూడా ఉండడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు.. కానీ పెళ్లంటూ జరిగితే?: త్రిష