Publish Date: Sat, 03 Jan 2015 (22:36 IST)
Updated Date: Sat, 03 Jan 2015 (22:46 IST)
దేశానికి భక్తి మార్గాన్ని చూపిన వారిలో సాధువులు, సంతులది ప్రధాన పాత్రని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు తెలిపారు. శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగిన త్రైమాసిక మెట్లోత్సవం సందర్భంగా ఏర్పాటైన భజన మండళ్ల సమావేశం కార్యక్రంమలో ఆయన మాట్లాడుతూ, దాదాపు 2500 భజనమండళ్ళ తిరుపతిలో ఊరేగింపు నిర్వహించాయి.
తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి భజన కళాకారులు ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంది భక్తి మార్గాన్ని ఎన్నుకోవడం వలననే దేశంలో ఆ సంస్కతి వస్తోందన్నారు. ప్రతి ఏడు నిర్వహించే త్రైమాసిక మెట్లోత్సవం ఉన్నతమైన కార్యక్రమమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పెజావర్ మఠం పీఠాధిపతి విశేష తీర్థ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్లోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం 4 గంటలకు నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామి భక్తి కీర్తనలతో భజన మండళ్లు తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తారు.