Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోమాత పూజ.. గోవత్స ద్వాదశి రోజున చేస్తే!

Advertiesment
Gomata puja in govatsa dwadasi
, బుధవారం, 15 అక్టోబరు 2014 (18:26 IST)
గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు. 
 
గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ బహుళ ద్వాదశి' కనిపిస్తుంది. దీనినే 'గోవత్స ద్వాదశి' అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. 
 
ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది. 
 
దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu