శ్రీ శారద ఆలయం స్ట్రౌడ్స్‌బర్గ్, పీఏలో గోశాల
, శనివారం, 15 సెప్టెంబరు 2012 (20:15 IST)
స్ట్రౌడ్స్‌బర్గ్‌లోని శ్రీ శ్రింగేరీ విద్యాభారతి ఫౌండేషన్ సంస్థ వారు శారదా ఆలయంలోని గోశాల నిర్మాణం పూర్తవడంతో ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఈ గోశాలలోకి వచ్చిన మొదటి పశుసంపద మొదటి ఆవుకు(లక్ష్మీ)గా మరియు మొదటి దూడకు(శారద)గా నామకరణం చేశారు. హిందూ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన జంతువు ఆవు. హిందువులు ఆవును కేవలం ఓ జంతువులా చూడక సాక్షాత్తు దైవ స్వరూపంలా పూజిస్తారు. హిందూ పురాణేతిహాసాల ప్రకారం "అమ్మ లేక మాత" అన్న పదాల నుండి ఉద్భవించిన ఐదు శబ్ద పదాలు స్వమాత, వేదమాత, భూమాత, గోమాత చివరగా శ్రీ మాత. ఈ ఐదు పదాలు హిందూ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.భారత హిందూ ఇతిహాసాల ప్రకారం ప్రతీ జీవినీ గౌరంవంతో, శ్రద్ధా భక్తులతో ఆదరించాలని ప్రపంచ సమస్త కోటి జీవరాశిలో అతి ప్రాముఖ్యమైనవి ఆవు, తామర పువ్వు, తులసి మొక్క , బిల్వ వృక్షంగా చెప్పబడ్డాయి. కనుక వీటిని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని హిందూ పురాణాలలో తెలియజేస్తున్నాయి.మానవుడి జీవన గమనానికి మార్గ దర్శకాలు ఏర్పరచిన భగవధ్గీతలో శ్రీకృష్ణుడు ఆవులను అతి పవిత్రమైనవిగా మానవ దైనందిక జీవితంలో ప్రతి రోజు గోపూజ చేయడం వల్ల భగవంతుని కృపకు పాత్రులవుతారని తెలియజేయడమైనది.నేటి యాంత్రిక యుగంలో పురాణాలను పక్కకు నెట్టి మానవుడు కుళ్లూ కుతంత్రాలతో గోమాత ప్రాముఖ్యాన్ని మరచిపోతు ఆవుల సంతతి అంతరించిపోయే స్థితికి దిగజార్చాడు. ఈ తరుణంలో హిందూ సాంప్రదాయాలను కాపాడేందుకు శ్రీ శ్రింగేరీ శారదా పీఠం వారు గోపూజ గోసంరక్షణ శాల వంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు గోమాత విలువ తెలిసేలా ప్రపంచ వ్యాప్తంగా గోపూజలను నిర్వహించన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థవారు ఆలయ ప్రాంగణంలో ఓ గోశాలను నిర్మించి వాటి సంరక్షణ చర్యలు చేపట్టి ఈ గోశాలల ద్వారా అంతరిచిపోతున్న గోమాతలను కాపాడడమే కాకుండా గోపూజలతో మానవాళికి సకల పాపాల నుండి విముక్తి పొందేందుకు గోవుశాల ద్వారా గోవుల సంరక్షణను చేపట్టింది ఈ సంస్థ.