Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిస్‌మిస్‌ను ఆవు నెయ్యిలో వేయించి మగవారు తింటే...?

సహజంగా ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులకు కొన్ని రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. ఈ విషయం మనకు తెలియక ఏ చిన్న సమస్య వచ్చిన మందులు వాడేస్తుంటాం. అలా కాకుండా ప్రకృతిపరంగా మనకు దొరికేవి క్రమంతప్పకుండా తినడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. మఖ్యంగా మనం

కిస్‌మిస్‌ను ఆవు నెయ్యిలో వేయించి మగవారు తింటే...?
, బుధవారం, 4 ఏప్రియల్ 2018 (22:16 IST)
సహజంగా ప్రకృతిలో దొరికే కొన్ని వస్తువులకు కొన్ని రోగాలను నయం చేసే గుణం ఉంటుంది. ఈ విషయం మనకు తెలియక ఏ చిన్న సమస్య వచ్చిన మందులు వాడేస్తుంటాం. అలా కాకుండా ప్రకృతిపరంగా మనకు దొరికేవి క్రమంతప్పకుండా తినడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడవచ్చు. మఖ్యంగా మనం తినే ఆహారపదార్థాల వల్ల కావచ్చు లేదా మానసిక వత్తిడి వల్ల కాని కొంతమందికి శృంగారం పట్ల ఆసక్తి ఉండదు. కొందరికి ఆసక్తి తగ్గుతుంది.
 
ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారికి మానసిక ఒత్తిడి, తీసుకునే ఆహారం వల్ల శృంగారంలో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను మనకు దొరికే కొన్ని వస్తువుల ద్వారా తగ్గించుకోవచ్చు. అవేంటంటే...
 
1. పొద్దుతిరుగుడు విత్తనాలు: ఈ విత్తనాలలో ఉండే జింక్ మగవారిలో వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అంతేకాకుండా శృంగార వాంఛను కలుగజేస్తుంది.
 
2. కిస్‌మిస్ : వీటిని ఆవునెయ్యిలో వేయించి తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు శృంగారం పట్ల కోరికను కలుగజేస్తుంది. ఇవే కాకుండా దానిమ్మ, అరటిపండు, మునగకాయ, మునగాకు, క్యారెట్, పుచ్చకాయ లాంటివి తరచుగా తీసుకోవడం వల్ల వీర్యకణాలు వృద్ధి చెంది శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దానిమ్మరసంలో కొంచెం నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగితే మంచిది. అల్లం రసంలో ఉప్పు కలిపి తాగాలి.
 
3. పుచ్చకాయలో సహజంగానే శృంగార పటుత్వాన్ని పెంచే లక్షణం ఉంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తవు. మునగపూలు భార్యాభర్తలిద్దరూ పాలల్లో కలుపుకుని తాగడం వల్ల శృంగార వాంఛ కలుగుతుంది. 
 
4. గుమ్మడి విత్తనాలు : ఇందులో బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది కనుక శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. రోజువారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శృంగార సమస్యను తగ్గించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ పెదవులకు తేనె రాసుకుంటే ఫలితం ఏమిటో తెలుసా?