అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
పుచ్చకాయ, కీరకాయ, అరటిపండును సేవిస్తే అసిడిటీ మటుమాయం.
అసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి.
కొబ్బరి నీళ్ళను సేవించాలి. ప్రతి రోజు లవంగ ముక్కను సేవిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.