Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండువేసవిలో బరువు తగ్గించుకోవాలంటే ఇదే అదను.. ఎలా?

వేసవికారణంగానే మన శరీర బరువును బాగా తగ్గించుకోవచ్చనే విషయం ప్రజల అహగాహనలో లేదు. ఇతర సీజన్లలో మాదిరి వేసవిలో వివరీతమైన వర్కవుట్లు, నోరు కట్టేసుకోవలసిన అవసరం లేకుండానే శరీర బరువును తగ్గించుకోవచ్చని పోషక

Advertiesment
మండువేసవిలో బరువు తగ్గించుకోవాలంటే ఇదే అదను.. ఎలా?
హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (07:12 IST)
వేసవి సీజన్‌లో దక్షిణ భారతాన్ని వణికించే అగ్నికార్తె లేదా రోహిణీ కార్తె వచ్చేసింది. ఈ 15 రోజులూ వందలాది ప్రాణాలు ఏటా హరీమంటుంటాయి. ఈ సారి కూడా ఎండలు మండుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేసే  ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. ఎండల తీవ్రతకు చాలామంది వేపుడు, నూనె వస్తువులు, మసాలాలు, జంక్‌ఫుడ్‌ తీసుకోడానికి ఇష్టపడరు. కానీ వేసవికారణంగానే మన శరీర బరువును బాగా తగ్గించుకోవచ్చనే విషయం ప్రజల అహగాహనలో లేదు. ఇతర సీజన్లలో మాదిరి వేసవిలో వివరీతమైన వర్కవుట్లు, నోరు కట్టేసుకోవలసిన అవసరం లేకుండానే శరీర బరువును తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అదేదో వారి మాటల్లోనే విందామా... 
 
వేసవిలో కొద్దిసేపు వ్యాయామం చేసినా బాగా చెమటపడుతుంది. కొవ్వు సులువుగా కరగడానికి అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల సహజంగానే బరువు తగ్గుతారు. వేసవిలో అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల్లో నీటి శాతం ఎక్కువ.పుచ్చ, కీర, కర్బూజ, తాటిముంజలు, బీర, పొట్ల వంటి వాటిని ఆహారం గా తీసుకోవడం వల్ల శరీరాని కి కావాల్సిన పోషకాలు, లవ ణాలు అందుతాయి. నీటిశా తం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది. 
 
వేసవిలో మెటబాలిజం తక్కువగా ఉంటుంది. అధిక వ్యాయామం అవసరం లేదు. ఉద యం 8గంటల లోపు, సాయంత్రం 6 తర్వా త ఆరు బయట వ్యాయామం చేయాలి. ఓవర్‌ వర్క్‌ అవుట్లు, మితిమీరిన వ్యాయామం చేయకూడదు. సమ్మర్‌లో కొద్దిసేపు శరీరం కదిలి నా త్వరగా అలసిపోతారు. చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలోని ఖనిజలవణాలు బయటకి వెళ్లి డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
 
బరువు తగ్గించుకోవాలనుకునేవారికి వేసవి ప్రకృతి ఇచ్చిన అవకాశం. ఎండాకాలంలో ఆకలి తక్కువ. దాహం ఎక్కువ ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా ఉండదు. ఫ్యాటీ పదార్థాలు తీసుకోడానికి ఇష్టపడం. నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకుంటాం. సమ్మర్‌లో డైట్‌ పాటిస్తూ సీజన్‌కు తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. 
 
బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్‌ సరైన వ్యాయామం. ఈత రానివారికోసం ఆక్వా జుంబా, ఆక్వా యోగ వంటివి ఉన్నాయి. వర్క్‌అవుట్స్‌ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదు. సమ్మర్‌లో స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం. ఈదుతున్నప్పుడు కాళ్లు, చేతులతోపాటు శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది. బరువు తగ్గాలని అనుకునేవాళ్లు ఈతకు వెళ్లడం మంచిది. నీటిలో వ్యాయామం చేయడంతో శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది. స్విమ్మింగ్‌ అధిక క్యాలరీలను కరిగించే వ్యాయామం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపి? (టిప్స్)