Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయి పండు తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా?

బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి.

Advertiesment
Papaya health benefits
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (21:41 IST)
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి తగు మోతాదులోనున్నాయి. 
 
తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే.
 
ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.  కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. 
 
అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
 
కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడ తగ్గించవచ్చు.పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. 
 
బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు. తింటే గర్భస్రావం జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జామ ఆకులతో మేలు... జామ ఆకుల టీ తాగితే...