Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిడ్నీలో రాళ్ళను కరిగించే జ్యూస్...

కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ రాళ్ళు ఏర్పడుతుండాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చంటున్నారు వై

కిడ్నీలో రాళ్ళను కరిగించే జ్యూస్...
, సోమవారం, 22 జనవరి 2018 (22:14 IST)
కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. అయితే కొందరికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ రాళ్ళు ఏర్పడుతుండాయి. అలాంటివారు రోజూ నారింజ పండ్ల రసం తీసుకుంటే ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యపరిశోదకులు.
 
 2. పులిపిర్లు చాలా పెద్దసమస్య. ఇది ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్. కొందరు వీటిని గిల్లడం, లాగడం వల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవాలనుకుంటే ఇలా చేయండి. 1.వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్లపైన రుద్దుతూ ఉండాలి. 2.ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి. దీని నుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి. అలా దాదాపు నెల రోజులపాటు చేయాలి. 3.బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో పులిపిర్లపైన రుద్దుతూ ఉండాలి. ఇలా క్రమంతప్పకుండా 15,20 రోజుల పాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయి.     
 
3. నిద్రలేమి చాలా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. అలాగని నిద్రమాత్రలు వాడితే సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి. సుఖవంతమైన నిద్రకోసం రోజూ ఒక కప్పు దానిమ్మ జ్యూస్ తాగాలి. ప్రతిరోజు పడుకునే ఒక గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి.  
 
4. ఆస్తమా ఉన్నవాళ్ళు పది నల్ల మిరియాలు, రెండు లవంగాలు, గుప్పెడు తులసి ఆకులు తీసుకుని వాటిని మరుగుతున్న నీటిలో వేయాలి. స్టవ్‌ని పావుగంట సిమ్‌లో ఉంచి నీటిని మళ్ళీ మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు తేనె వేయాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి రెండు స్పూన్లు ద్రవాన్ని రెండు వారాల పాటు రోజూ సేవించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యం గర్భనిరోధక మాత్రలు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?