Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విపరీతంగా బహిష్టు నొప్పి.... పోవాలంటే...

కొందరు ఆడవాళ్ళు బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని సహజ మార్గాలున్నాయి. రోజులో కీసం ఒకసారి టీ తాగాలి. వేడి టీ కండరాల నొప్పి నుండి స్వాంతనను చేకూర్చుతుంది. అల్లం టీ, పెప్పర్ టీ, లావెండర్ టీ, గ్రీన్ టీ,

Advertiesment
Natural Ways to Reduce Period Pain
, శుక్రవారం, 8 జులై 2016 (19:24 IST)
కొందరు ఆడవాళ్ళు బహిష్టు సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని సహజ మార్గాలున్నాయి. రోజులో కీసం ఒకసారి టీ తాగాలి. వేడి టీ కండరాల నొప్పి నుండి స్వాంతనను చేకూర్చుతుంది. అల్లం టీ, పెప్పర్ టీ, లావెండర్ టీ, గ్రీన్ టీ, యాలకుల టీ, లెమన్ గ్రాస్ టీ, హెర్బల్ టీ ఏది తాగినా ఆ టైమ్‌లో మంచిదే. 
 
హెర్బల్ టీ అయితే అలసట పోగొట్టటమేగాక నొప్పిని తగ్గిస్తుంది. బహిష్టు సమయంలో కాఫీ తాగరాదు. కాఫీ రక్త నాళాలను ముడుచుకొని పోయేటట్లు చేస్తుంది. అయితే కాఫీ తాగకుండా ఉండలేని వారు పీరియడ్స్ కొద్ది రోజుల ముందర నుంచి కాఫీ తాగడాన్ని తగ్గించుకుంటూ వస్తే బహిష్టు సమయంలో తాగకుండా ఉండగలిగే ప్రయత్నం చేయగలరు. 
 
రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగడం వల్ల ఆ టైములో నొప్పి నుండి సాంత్వన పొందుతారు. అల్లం బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. బహిష్టులు సక్రమంగా వచ్చేట్టు చేస్తుంది. అల్లాన్ని మెత్తగా తురిమి  కప్పుడు నీళ్ళలో ఐదు నిమిషాలు సేపు ఉడకబెట్టాలి. తరువాత పొయ్యి మీద నుంచి కిందకు దించి ఆ నీటిని వడగట్టాలి. అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం పోసి బాగా కలపాలి. బహిష్టు సమయంలో ఈ టీ ని రోజుకు మూడుసార్లు తాగితే కడుపునొప్పి, ఇతర బాధలు తగ్గుతాయి. హాట్ వాటర్ బ్యాగును ఇపయోగిస్తే కూడా బహిష్టు నొప్పి తగ్గుతుంది. గర్భాశయంలోని కండరాలు హాట్ వాటర్ లోని వేడి రిలాక్స్ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయిలో ఏముంది...? తింటే ఏం జరుగుతుంది...?