ఈ రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఇంటిపని, ఆఫీసు పని చేస్తూ పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. మహిళలు తరచూ నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే, నడుం నొప్పి తగ్గుతుంది. అల్లంరసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడిచేసి నడుముకు మర్ధనచేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే, నడుంనొప్పి తగ్గుతుంది.
2. ఒళ్ళు లావుగా ఉండి నడుంనొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున తాగితే, ఒళ్లు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవునెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే నడుంనొప్పి తగ్గిపోతుంది.
3. వెల్లుల్లిపాయలు నాలుగు ఒక చెంచా నువ్వుల నూనెలో వేయించి, అందులో సైంధవ లవణం కలిపి తింటుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది.