Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరంగరం మిర్చి తింటే అల్సర్ వస్తుందనుకుంటారు కానీ... మిర్చి మేలు ఏంటంటే...?

మిరపకాయలు ఎక్కువగా తినొద్దు, తింటే అల్సర్‌ అని అంటుంటారు. అయితే ఒక నిర్ణీత పరిధిలో తింటే ఫరవాలేదు. పచ్చిమిరపకాయలంటే ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు. అదివరకటి కాలంలో అయితే పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపను కలిపి తినేవారు. ఇప్పటి కాలంలో పిజ్జా, బర్గర్

Advertiesment
mirchi benefits
, సోమవారం, 18 ఏప్రియల్ 2016 (13:17 IST)
మిరపకాయలు ఎక్కువగా తినొద్దు, తింటే అల్సర్‌ అని అంటుంటారు. అయితే ఒక నిర్ణీత పరిధిలో తింటే ఫరవాలేదు. పచ్చిమిరపకాయలంటే ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు. అదివరకటి కాలంలో అయితే పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపను కలిపి తినేవారు. ఇప్పటి కాలంలో పిజ్జా, బర్గర్లలో టమాటా సూప్‌, జామ్‌, జెల్లీలను జనం హాయిగా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రలియాలో టాస్మేనియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.
 
మిర్చిని అధికంగా వినియోగించేవారిలో షుగర్‌ నియంత్రణ శక్తి అధికంగా ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనలలో తేలింది. ఇందులో ఉండే కెప్సానిన్‌, డీహైడ్రాకెప్సానిన్‌లకు రక్తంలో గ్లూకోజ్‌ శాతం నిల్వలను తగ్గించే శక్తి ఉందట. మిర్చిని అధి మోతాదులో తినేవారిలో రక్తం గడ్డకట్టే అవకాశం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన వెైద్యుడు డా.కిరణ్‌ అహుజా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మిరపకాయలను అలవాటు చేసుకోనవసరం లేదంటున్నారు వైద్యులు.
 
మిరప కాయలు అధికంగా వాడేవారు తమ అలవాట్లు మార్చుకోనవసరం లేదు. మిర్చిని అంత కారంగా తినలేకపోతే... అందులో కొద్దిగా తీపిని, చింతపండును చేర్చి కారం చట్నీగా దోసెల్లోకి తింటే బాగుంటుంది. టమాటా సాస్‌లాగా చిల్లీసాస్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కళ్ల వెంబడి నీళ్లు తెప్పించినా అది చేసే మేలు మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆంధ్రా స్పెషల్‌ మిరపకాయ బజ్జీలు కనిపిస్తుంటాయి. కొద్దిగా వర్షం కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు యువతరం తప్పక మిర్చిబజ్జీలను ఆశ్రయిస్తుంటుంది. 
 
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మిర్చి బజ్జీలను, అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కమ్మనైన రుచిని ఆస్వాదిస్తుంటారు. కారం తినలేనివారు మాత్రం వాళ్ల వంక జాలిగా చూస్తుంటారు. గృహిణులు కూడా లావుగా ఉండే మిర్చి బజ్జీలలో శనగపిండిని కూరి డీప్‌గా ఫ్రై చేసుకుని కూరలా చేసుకుని అన్నంలో తింటుంటారు. సాధారణంగా లావుగా ఉండే మిర్చిలో కారం పాళ్లు కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనితో చాలామంది చట్నీలు చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంత కారం వాళ్లు ఎలా తినగలుగుతున్నారా అని. కారం అధికంగా తినేవారు తీపి పదార్ధాలను తినలేరు. ఇన్నాళ్లూ షుగర్‌ వ్యాధికి చేదు కాకరతోనే నివారణ అనుకునేవారు.
 
ఇటీవల వచ్చిన సర్వేతో మిర్చిని ప్రేమించేవారు ఇక భయపడాల్సిన పనిలేకుండా హ్యాపీగా లాగించేయవచ్చు. సాధారణంగా శనగలను ఆడవారు వాయినాలు ఇచ్చుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బెంగాల్‌గ్రామ్‌గా పిలిచే ఈ శనగలలో అత్యధికమైన పోషక విలువలు ఉన్నాయి. రోజంతా కటిక ఉపవాసం ఉన్నా సరే శనగలు తిని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉడకబెట్టిన శనగలు, నానబెట్టిన శనగలు మంచి ప్రొటీన్లుగా ఉపయోగపడతాయి. వంద గ్రాముల శనగలలో 61.2 శాతం పిండిపదార్ధాలు, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఇనుము, 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా. పొటాషియం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu