కుంకుమ పువ్వుకు ప్రత్యేకమైన రుచి, వాసన వుంటుంది. ఇది మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కుంకుమ పువ్వుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కుంకుమ పువ్వుతో మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు, నిస్పృహ లక్షణాలకు చికిత్స చేయవచ్చు.
కుంకుమపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేసి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీపురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే ఆహారాలు లేదా సప్లిమెంట్లను కుంకుమ పువ్వుతో చేస్తారు.
కుంకుమ పువ్వుకి ఆకలిని తగ్గించే గుణం వుంది కనుక ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కుంకుమ పువ్వుతో గుండె జబ్బు ప్రమాద కారకాలను తగ్గించవచ్చు. కుంకుమపువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అల్జీమర్స్ వ్యాధి ఉన్న పెద్దలలో జ్ఞాపకశక్తిని కుంకుమ పువ్వుతో మెరుగుపరచవచ్చు.