Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Advertiesment
sugarcane juice benefits

సిహెచ్

, శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:57 IST)
చెరకు రసం. ఇది సహజ పానీయం. ఇందులో సహజ చక్కెరలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా హైడ్రేషన్‌కు మంచి వనరు. ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతున్నప్పటికీ ఇందులో చక్కెర కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక మధుమేహం ఉన్నవారు దూరంగా వుండటం మంచిది. చెరకురసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెరకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది.
చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం వినియోగం దోహదం చేస్తుంది.
చెరకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి.
ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకురసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
వేసవి కాలంలో చెరకు రసం తాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్ల బరుస్తుంది.
క్యాలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ గనుక ఊబకాయులూ తీసుకోవచ్చు.
ఆకట్టుకునే రుచితో పాటు, అందుబాటు ధరలో ఉంటుంది గనుక అందరూ వాడొచ్చు.
చెరకు రసంలో నిమ్మ, అల్లం రసంగానీ, కొబ్బరి నీరుగానీ కలుపుకొని తాగితే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు