దేశవ్యాప్తంగా H3N2 ఇన్ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి చెందడంతో, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సులభంగా వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే యాంటీవైరల్ ఫుడ్స్ తీసుకోవాలి. H3N2 ఇన్ఫ్లూయెంజా వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు, వళ్లు నొప్పులు.
వైరస్ లక్షణాలు కనిపించని వ్యక్తులు ముందుజాగ్రత్తగా హెర్బల్ ఉత్పత్తులను తీసుకోవచ్చు. వైరల్ లక్షణాలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు హెర్బల్ ఫుడ్ తినవచ్చు. అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణం శరీరంలో వైరస్‌ల పెరుగుదలను నివారిస్తుంది. తులసిని నీటిలో వేసి మరిగించి తాగితే జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతాయి.
సోంపులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పొందవచ్చు. పసుపును పాలలో కలిపి తాగడం వల్ల శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరగకుండా అదుపులో ఉంటుంది.
పుదీనాలో ఉండే యాంటీ వైరల్ గుణాల కారణంగా పుదీనా టీని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.