బాదం పప్పులు, నూనె సేవించడం వలన కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.
1. బాదం నూనెను తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది.
2. కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా బాదం నూనెను వాడొచ్చు. ఆహారానికి రంగు, రుచి వచ్చేలా దీనిని (ఫుడ్ ఎడిటివ్) వాడొచ్చంటున్నారు వైద్యులు.
3. కడుపులోనున్న ఇబ్బందులను తొలగించి, కడుపులోని ప్రేగులలో క్యాన్సర్ లక్షణాలుంటే కూడా ఇది తొలగిస్తుంది.
4. బాదం నూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది.
5. బాదం సేవిస్తుంటే మెదడుకు, నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.