Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చర్మవ్యాధులను నయం చేసే లవంగాలు, ఎలా?

Advertiesment
Cloves to cure skin diseases
ఆరోగ్యపరంగా లవంగాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో వైద్య విలువలు కూడా ఉన్నాయి. లవంగ నూనెను పంటి నొప్పికి మందుగా ఉపయోగిస్తారు. బాగా నలిపిన లవంగ ఆకులు పంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఎసిడిటి మరియు అజీర్ణానికి లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. రుచి, కారం కోసం కూరలలో ఎక్కువగా వాడుతుంటారు. వంటకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
 
కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.
 
ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.
 
జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 
లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరం వేడి చేస్తుంది.
 
లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.
 
ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతో పాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

COVID variant: omicron BA.4.6 గురించి తెలుసా?