Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీట్‌రూట్ జ్యూస్... పిప్పితో తీసుకుంటే...?

ఎన్నో పోషక విలువలున్న బీట్‌రూట్ ఆరోగ్య ప్రదాయిని అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో యూనివర్శిటీలు చేసిన పరిశోధనల్లో భాగంగా ఈ బీట్‌రూట్‌ని ఘన రూపంలోనో, ద్రవరూపంలోనో తీసుకోవడం వలన మరెన్నో ఉపయోగాలు ఉన్నాయని నిరూపితమై

Advertiesment
Beetroot juice
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:40 IST)
ఎన్నో పోషక విలువలున్న బీట్‌రూట్ ఆరోగ్య ప్రదాయిని అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో యూనివర్శిటీలు చేసిన పరిశోధనల్లో భాగంగా ఈ బీట్‌రూట్‌ని ఘన రూపంలోనో, ద్రవరూపంలోనో తీసుకోవడం వలన మరెన్నో ఉపయోగాలు ఉన్నాయని నిరూపితమైంది. 
 
బీట్‌రూట్‌ జ్యూస్‌ని తీసుకోవడం వృద్ధుల్లో మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది అని వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం తేల్చి చెప్తే, కొంచెం చిక్కని బీట్‌రూట్‌ జ్యూస్‌ని తీసుకోవడం వలన గుండె బలహీనంగా ఉన్నవారిలో కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్ధారించింది. ఎత్తైన కొండలు, పర్వతాలు అధిరోహించేటప్పుడు గాలిలో పీడన స్థాయిలు తగ్గిన పరిస్థితుల్లో సరైన మోతాదులో ప్రాణవాయువుని తీసుకోలేకపోవడం మూలంగా ఏర్పడే సమస్యలను బీట్‌రూట్‌ జ్యూస్‌తో నివారించవచ్చని ఓ నార్వే యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది. కన్సాస్ స్టేట్ యూనివర్శిటీ చేసిన పరిశోధనల్లో వ్యాయామం చేసే ముందు బీట్‌రూట్‌ జ్యూస్ తీసుకోవడం మూలంగా కండరాలకు రక్తప్రసరణ దాదాపు 38 శాతం వేగంగా జరుగుతుందట. 
 
ఓ గ్లాసు బీట్‌రూట్‌ జ్యూస్‌ని తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అన్నీ అందుతాయని, అయితే ఈ జ్యూస్ తీసుకునేటప్పుడు అందులోని పిప్పిని తీసివేయరాదని చెబుతున్నారు. అసలు ఆ పిప్పి పదార్థంలోనే ఈ మ్యాజిక్ చేసే ఫైబర్ ఉందట. ఐతే అలా గాఢమైన, పిప్పితో కూడిన జ్యూస్ తీసుకోలేనివారికి వేరే మార్గం ఉంది. పిప్పి తీసివేసిన బీట్‌రూట్‌ జ్యూస్‌లో ఆక్సాలిక్ ఆమ్లం ఉండే అవకాశం ఉన్నందున, దాన్ని ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి తీసుకోవడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునగాకుతో సూప్ ఎలా చేయాలో తెలుసా?