Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ ఒక్క కాయతో శరీరంలోని అవయవాలన్నీ సేఫ్‌..

మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాంట్లో నుంచి వచ్చే పండ్లపైన అంతగా దృష్టి పెట్టరు మనవారు. మనలో చాలామంది ఏదైతే చవకగా దొరుకుతుందో దాన్ని పట్టించుకోరు. ఏదైతే చాలా ఖరీదుగా ఉంటుందో దాని వెంటపడుతుంటారు. కానీ చవకగా

ఈ ఒక్క కాయతో శరీరంలోని అవయవాలన్నీ సేఫ్‌..
, శుక్రవారం, 24 నవంబరు 2017 (21:53 IST)
మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి. పెరటిలో ఉన్న దాంట్లో నుంచి వచ్చే పండ్లపైన అంతగా దృష్టి పెట్టరు మనవారు. మనలో చాలామంది ఏదైతే చవకగా దొరుకుతుందో దాన్ని పట్టించుకోరు. ఏదైతే చాలా ఖరీదుగా ఉంటుందో దాని వెంటపడుతుంటారు. కానీ చవకగా దొరికే దానిలో విలువైనది ఉంటే అబ్బా దీన్ని అనవసరంగా ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాం కదా అనుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో పెరటిలో ఉండే పండ్లలో జామపండు ఒకటి.
 
జామకాయలో ఉన్న పోషకాలు మరే ఇతర పండ్లలో లభించవు. జామపండులో ఎ,బి,సి విటిమిన్స్ అధికంగా ఉంటాయి. జామలో పోషకాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి జామ చాలా మంచిది. జామపండు తినడం వల్ల మలబద్ధకం చాలావరకు తగ్గుతుంది. షుగర్ ఉన్న వారికి జామపండు చాలా మంచిది. కమలా పండులో దొరికే విటమిన్ సి కంటే జామపండులో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. 
 
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కదా.. ఆకుకూరల్లో దొరికే పీచుకంటే జామలో రెండు రెట్లు ఎక్కువగా దొరుకుతుంది. పది ఆపిల్స్‌లో ఉండే పోషకాలు ఒక్క జామకాయలో ఉంటాయట. తక్కువ ధరకు వస్తుందని జామను తక్కువ అంచనా వేయకూడదు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?