Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ 9 ప్రయోజనాలు తెలిస్తే జామ చెట్టును వదలలేమంతే...

Advertiesment
ఈ 9 ప్రయోజనాలు తెలిస్తే జామ చెట్టును వదలలేమంతే...
, మంగళవారం, 11 జూన్ 2019 (18:26 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో, అందులో మన పెరట్లో కాసే జామపండులో ఆపిల్‌లో కన్నా పోషకాలు ఎక్కువగా దాగి ఉన్నాయి. ఇందులో సి విటమిన్‌ నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జామపండులోనే కాకుండా జామ ఆకు, జామ బెరడులో కూడా పలు రకముల ఔషద గుణాలు ఉన్నాయి. అయితే ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.
 
1. జామ పండు హృద్రోగాలతోపాటు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో  కాల్షియం, ఐరన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు సాయపడతాయి. దంత పరిరక్షణకూ జామ దివ్యౌషధం. 
 
2. వీటిలో విటమిన్‌ ఏ మరియు విటమిన్‌ సి నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6,కరుగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. 
 
3. ఒక జామపండులో విటమిన్‌ సి నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మినరల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. 
 
4. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి. 
 
5. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు.
 
6. ఈ జామాకుల నుంచి తయారుచేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. 
 
7. జామ బెరడు యాంటీమైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కొల్లాజన్ ఉత్పత్తికి ఇది కీలకము.
 
8. అంతేకాకుండా కొవ్వు మెటబాలిజంను ప్రభావితంజేసే పెక్టిన్ జామలో లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.
 
9. జామపండులో కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగ దొంగ... అంటూ విజయమాల్యాను తరిమిన జనం..!