Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో సపోటా పండ్లను తినాల్సిందేనండీ... ఎందుకంటే?

Advertiesment
వేసవిలో సపోటా పండ్లను తినాల్సిందేనండీ... ఎందుకంటే?
, గురువారం, 7 మార్చి 2019 (21:17 IST)
సపోటాపండుని ఇష్టపడనివారుండరు. దీనిలో అనేక రకములైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైనా నీరసంగా బాగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది. దీనిలో ప్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర సమృద్దిగా ఉండటమే కారణం. రక్తహీనతతో బాధపడేవారు సపోటాని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సపోటాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. సపోటా పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి. రోజూ ఒక పండు చొప్పున తింటూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
 
2. సపోటాలో రక్తవృద్ధి, దాతుపుష్ఠిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, కెరొటనాయిడ్లు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉన్నాయి.
 
3. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల  శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి.
 
4. ఇవి మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాదిగ్రస్తం కాకుండా కాపాడతాయి.
 
5. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్దులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుంచి బయటపడతారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలకూరతో ఆ శక్తి రెట్టింపు....