Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గండెను పదిలంగా ఉంచే పది చిట్కాలు...

చూసేందుకు పిడికెడంతే ఉంటుంది గానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. అదీ గండెకున్న శక్తి. బలం. పుట్టుక నుంచి చనిపోయేంత వరకు నిరంతరాయంగా లబ్‌ డబ్‌‌మని కొట్టుకుంటూ.. అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె

Advertiesment
గండెను పదిలంగా ఉంచే పది చిట్కాలు...
, ఆదివారం, 26 ఆగస్టు 2018 (11:39 IST)
చూసేందుకు పిడికెడంతే ఉంటుంది గానీ చెట్టంత మనిషిని నిలబెడుతుంది. అదీ గండెకున్న శక్తి. బలం. పుట్టుక నుంచి చనిపోయేంత వరకు నిరంతరాయంగా లబ్‌ డబ్‌‌మని కొట్టుకుంటూ.. అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె ఎపుడైతే తన పనిని మానేస్తుందో అంతటితో మనిషి జీవితం పరిసమాప్తం. అలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవటానికి పాటిద్దాం 10 సూత్రాలు.
 
* నిద్రలేమితో రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెజబ్బుకు దారితీస్తుంది. రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యమూ పుంజుకుంటుంది. 
* ఒత్తిడితో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు పెరుగుతుంది. రోజూ కనీసం 20 నిమిషాల సేపు ధ్యానం చేస్తే ఒత్తిడి పలాయనం చిత్తగిస్తుంది. 
* గుండె కూడా కండరమే. దీనికీ ప్రోటీన్లు అవసరమే. చిక్కుళ్లు, బఠానీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజపప్పులు క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. 
 
* అధిక బరువు గుండెకూ చేటే. బరువు పెరగటం వల్ల గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఆహార, వ్యాయామాలతో బరువు పెరగకుండా చూసుకోవాలి. 
* తగినంత నీరు తాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గితే రక్తం చిక్కబడుతుంది. గుండెజబ్బు గలవారికిది మరింత హాని చేస్తుంది. 
* జంక్‌ఫుడ్‌తో మధుమేహం ముప్పు పెరుగుతుంది. అందుకే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.మధుమేహానికీ గుండెజబ్బుకూ లంకె ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. 
 
* అప్పుడప్పుడు విహార యాత్రలకు వెళ్లండి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. ఒంటికి ఎండ తగిలితే విటమిన్‌ డి కూడా లభిస్తుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి. 
* రోజులో కనీసం ఒక్కసారైనా నవ్వండి. నవ్వడం వల్ల రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల సమయం దొరికినప్పుడు జోక్స్‌ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి. 
* వీలు చిక్కినపుడ్లా శరీరానికి శ్రమ కల్పించండి. నడవడం, మెట్లు ఎక్కటం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాన్ని పెంచే పండ్లు ఇవే...