ప్రస్తుత జీవనశైలి ఉరుకులు పరుగులతో కూడుకుంది. దీంతో వ్యాయామం చేసే తీరిక అసలు ఉండటంలేదు. శరీరంలోని కెలొరీలు అలాగే ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కెలొరీలను ఖర్చు చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే...
** ప్రతిరోజూ మీకు సమయం దొరికినప్పుడల్లా మనసారా నవ్వుకోండి. దీంతో జీవక్రియ చురుగ్గా సాగుతుంది. ఇలా జరగడం వలన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. ఇలా నిత్యం చేస్తుంటే శరీరంలోని కెలొరీలు ఖర్చు అవుతాయంటున్నారు పరిశోధకులు.
** సాయంత్రం వేళల్లో టీవీ చూసే అలవాటుంటే సీరియళ్ళకు అతుక్కుపోకుండా కాసేపు హాస్యాన్ని అందించే కార్యక్రమాలను చూసి మనసారా నవ్వుకోండి. సుమారు 15 నిమిషాలపాటు నవ్వుకోండి. అందునా బిగ్గరగా నవ్వుకుంటే మీలో జరిగే మార్పు మీరే గుర్తిస్తారంటున్నారు వైద్య నిపుణులు.