గర్భావస్థలో డోకు : గర్భధారణ తర్వాత రెండు మూడు నెలల వరకు గర్భిణీ స్త్రీలకు వాంతులు, డోకు వచ్చేలా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక కప్పు ధనియాల కషాయంలో ఒక చెంచా కలకండ పొడిని కలుపుకోండి. ఇందులో ఒక కప్పు బియ్యం కడిగిన నీటిని కలుపుకుని సేవించండి. దీంతో వాంతులు, డోకులాంటివి తగ్గి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
మందాగ్ని: గర్భం ధరించిన తర్వాత అజీర్ణం కలుగుతుంది. ఇలాంటి సమయంలో 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల సొంఠి కలిపి పొడి చేసుకోండి. ఈ పొడి నూకనూకగా ఉండేలా చూసుకోండి. ఓ గ్లాసు నీటిలో రెండు చెంచాల పొడినివేసి కలుపుకోండి. నీటిలో కలిపిన ఈ పొడిని బాగా మరగబెట్టండి. కాసేపయ్యాక చల్లార్చండి. దీనిని వడగట్టి సేవిస్తే మందాగ్ని( అజీర్ణం ) తగ్గి జీర్ణక్రియ వృద్ధి జరిగి ఆకలి బాగా వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.