ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం సర్వసాధారణం. అలాగే జిమ్‌కు వెళ్ళి తమ శరీరాకృతిని మెరుగుపరచుకోవడం కూడా ఓ ఎత్తు. చాలామంది ప్రారంభంలో జిమ్‌కు ఉత్సాహంగా వెళ్ళతారు. కాని కొన్నాళ్ళకే సమయం సరిపోవడం లేదంటూ జిమ్‌కు వెళ్ళడం మానేస్తుంటారు.
మీకున్న విలువైన సమయంలో జిమ్‌కు వెళ్ళే బదులు ఇంట్లోనే ప్రతి రోజూ పది నిమిషాలపాటు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయం అల్పాహారానికి ముందు మీ శరీరమంతా వేగంగా కదిలేలా నడవండి. ఇలా ఇరవై నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇలా చేస్తుంటే శరీరంలోని కొవ్వు కరిగి చక్కటి ఆకృతి వస్తుంది. అలాగే కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే స్కిప్పింగ్ లాంటివి చేస్తుంటే కూడా శరీరంలోని కొవ్వు తగ్గి ఆకృతి చక్కగా ఉంటుంది.
కొందరు పనులు చాలా చురుకుగా చేస్తుంటారు. అలాంటి వారి శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అదే వీరు అధిక బరువు సమస్యతో బాధపడరు. అంటే తమ పనులు ఎవరైతే నిదానంగా చేస్తుంటారో వారు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి నడక ప్రారంభించండి.