ప్రతి మనిషి జీవితంలోనూ ఒక పనికి కొన్ని హద్దులుంటాయి. మీరు చేసే పనులు మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోవాలి. ఏ విషయంలోకూడా అతిగా ప్రవర్తించకూడదు. "అతి సర్వత్ర వర్జయేత్". మీరు మీ హద్దుల్లో ఉంటే ఇతరులు మీతో మర్యాదాపూర్వకంగానే వ్యవహరిస్తారు. చివరికి మీ ఆరోగ్యంకూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఏది పడితే అది తినకుండా ఉంటే ఆరోగ్యానికి చాలామంచిదంటున్నారు వైద్యులు. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం లాంటివి చేయకూడదంటున్నారు ఆరోగ్యనిపుణలు. అతిగా తింటే అజీర్తి, అతిగా నిద్రపోతే అలసత్వం మీ వెంటే ఉంటాయని వాటిని దూరంచేసుకోవాలనుకుంటే మీరు శరీరానికి కావలసినంత ఆహారం, నిద్ర అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.