Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారిన కేన్సర్ మహమ్మారి

Advertiesment
VS Children Hospital
ప్రస్తుతం దేశంలో ప్రతి యేడాది 45 వేల మందికి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా 5 నుంచి 14 యేళ్లలోపు చిన్నారులే. పైగా, చిన్నారుల మరణాలకు తొమ్మిదో కారణంగా కేన్సర్ మహమ్మారి మారిపోయింది. ముఖ్యంగా, చైనా వంటి దేశాల్లో ఇంది మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, ఈ వ్యాధి బారినపడేవారిలో ఎక్కువగా చిన్నారులో ఉన్నారు.
 
అందుకే ఈ వ్యాధి బారినపడే చిన్నారులను అత్యాధునిక సౌకర్యాలతో కూడిన చికిత్సను అందించే నిమిత్తం చెన్నై మహా నగరంలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన వీఎస్ ఆస్పత్రి కొత్తగా వీఎస్ చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించింది. వీఎస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ హెమటో ఒంకాలజీ అండ్ బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ పేరుతో దీన్ని స్థాపించింది. చెన్నై నగరంలో ఈ తరహా ఆస్పత్రిని నెలకొల్పడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈ చిన్నపిల్లల ఆస్పత్రిని తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక శాఖ అడిషినల్ చీఫ్ సెక్రటరీ కె.షణ్ముగం, చెన్నై నగర పాలక సంస్థ కమిషనర్ డి. కార్తికేయన్, సినీ నటి గౌతమి, టియారా హోమోఫీలియా అండ్ కేన్సర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్ట్రీ అపర్ణా గుహన్ శ్యామ్‌తో పాటు వీఎస్ ఆస్పత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. షణ్మగంలు పాల్గొన్నారు.
webdunia
 
ఈ సందర్భంగా వీఎస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుబ్రమణియన్ మాట్లాడుతూ వివిధ రకాల కేన్సర్‌లతో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ తరహా ఆస్పత్రిని నెలకొల్పినట్టు చెప్పారు. ఈ ఆస్పత్రిలో 24 గంటల పాటు పీడియాట్రిక్ ఆంకాలజిస్టులు, పీడియాట్రిక్ సర్జన్లు, రేడియేషన్ ఆంకాలజిస్టులు అందుబాటులో ఉంటారని చెప్పారు. పైగా, లండన్ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ సొసైటీతో కలిసి ఈ ఆస్పత్రి పని చేస్తుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొద్దుగా ఉండే అమ్మాయిల్లో 'ఆ' పవర్ ఉండదా?