ఇప్పటివరకు గుండె, కిడ్నీ, కాలేయం వంటి శరీర అవయవాలమార్పిడి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. త్వరలోనే తల మార్పిడికి చైనా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏకంగా 10 మంది మహిళలకు గర్భాశయ మార్పిడికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం వారు సమాయత్తమవుతున్నారు.
నిజానికి ప్రపంచంలో తొలి గర్భాశయ మార్పిడి చేసింది మాత్రం స్వీడనే. ఆమె గత యేడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఆ తర్వాత టర్కీ, సౌదీ అరేబియాల్లో గర్భాశయ మార్పిడి చికిత్సలు జరిగినా అవి విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు పది మంది మహిళలకు ఒకేసారి గర్భాశయ మార్పిడి ఆపరేషన్లు చేయనున్నారు. లండన్ ఇంపీరియల్ కాలేజీ వైద్యులు ఈ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు.