Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారులకు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం రేలా హాస్పిటల్స్‌తో కంచికామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌

Advertiesment
Kanchi Kamakoti Childs Trust Hospital
, గురువారం, 7 జనవరి 2021 (18:08 IST)
ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా చిన్నారుల కోసం ప్రపంచశ్రేణి ఆరోగ్య సేవలను అందించే ప్రీమియర్‌ పిడియాట్రిక్‌ ఇనిస్టిట్యూట్‌ కంచి కామకోటి చైల్డ్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌ (కెకెసీటీహెచ్‌), పిడియాట్రిక్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ప్రీమియర్‌ మల్టీ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హాస్పిటల్‌ రేలా హాస్పిటల్‌తో భాగస్వామ్యం చేసుకుని ఆరేళ్ల బాలికకు విజయవంతంగా బోన్‌మారో మార్పిడి చేసింది.
 
‘‘చిత్తూరుకు చెందిన బాలికకు పుట్టుకతోనే తలసేమియా మేజర్‌గా గుర్తించడంతో పాటుగా పైపెదవి, అంగిలి లోపం కూడా కనుగొన్నారు. ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే రక్త మార్పిడి చేసి శస్త్రచికిత్సను చేశారు. ఆమెకు ప్రతి మూడు వారాలకూ ఓ మారు రక్తమార్పిడి చేయాల్సి ఉంది. శరీరంలో అధికంగా చేరే ఇనుము తొలగించేందుకు మందులను సైతం వాడాల్సి ఉంది. బోన్‌మారో మార్పిడి ద్వారా ఇతరుల్లాగానే ఆమె సాధారణ జీవితం గడుపగలదు’’ అని డాక్టర్‌ దీనదయాళన్‌, క్లీనికల్‌ లీడ్-పిడియాట్రిక్‌ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌-రేలా హాస్పిటల్‌ అన్నారు.
 
బాలికది నిరుపేద కుటుంబం కావడం చేత ఈ బోన్‌మారో మార్పిడిని పూర్తి ఉచితంగా రేలా హాస్పిటల్‌ చేసింది. దీనికి మిలాప్‌తో పాటుగా చైల్డ్స్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.సి ముత్తయ్య, ఆయన భార్య దేవికా ముత్తయ్యలు సైతం తోడ్పడ్డారు.
 
రేలా హాస్పిటల్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మొహమ్మద్‌ రేలా మాట్లాడుతూ, ‘‘పిల్లలకు నిస్వార్థంగా సేవ చేయడం నా మనసుకు నచ్చిన అంశం. ఎన్నో సంవత్సరాలుగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అనేది ఎన్నో కుటుంబాలకు ఆశనూ కలిగిస్తుంది. మౌలిక వసతులతో పాటుగా అవయవ మార్పిడికి ఎంతో నైపుణ్యం కావాలి. రేలా వద్ద మేము కాలేయం, మూత్రపిండాలు, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గు, ఆయాసం, జలుబు వదిలించుకునేందుకు సోంపు