కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు మందును కనిపెట్టాలని ప్రపంచ దేశాల్లోని సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రయోగదశలో వున్నాయి. మరికొన్నింటిని ప్రయోగించారు. ఫలితాలు ఆశించినస్థాయిలో వస్తే ఇక కరోనా వైరస్ పైన విజయం సాధించినట్లే.
ఇకపోతే వాటర్లూ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ప్రత్యేకమైన టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు, ఐతే ఇంకా ఇది ఫైనలైజ్ కాలేదు. DNA- ఆధారిత టీకా హోస్ట్ బాడీలో ఉన్న బ్యాక్టీరియాలో ప్రతిబింబిస్తుంది. ఇది COVID-19 కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి నాసికా కుహరం, తక్కువ శ్వాసకోశంలోని కణజాలాలను లక్ష్యంగా చేసుకుంటూ పని చేస్తుంది. ఇటువంటి ప్రక్రియను బాక్టీరియోఫేజ్ అంటారు. జస్ట్, ముక్కు రంధ్రాల్లో మందును స్ప్రే చేయడం ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని అంటున్నారు.
కోవిడ్ 19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయడానికి, టీకా లక్ష్యంగా ఉన్న కణజాలాలలో వైరస్ లాంటి కణాన్ని ఈ టీకా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా మానవ శరీరంలో ఇంజెక్ట్ చేసిన వ్యాధికి కారణమయ్యే వైరస్ లేదా బ్యాక్టీరియా పైన ఇది పోరాడుతుంది. వైరస్‌ను అడ్డుకునేందుకు అవరసమైన రోగనిరోధక శక్తిని ఇది కలిగిస్తుంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రయోగదశలో వున్నట్లు తెలియజేశారు.