Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానం చేయకపోయినా తప్పే.. చేసినా తప్పేనట.. ఎలా?

ప్రతిరోజూ స్నానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని, శుభ్రంగా ఉంటామని మనం నమ్ముతాం. కాని దీనిపై రెండో ఆలోచన కూడా చేస్తే మంచిదంటోంది కొత్త సర్వే. అతిగా శరీరాన్ని శుభ్రం చేసినా, ఎక్కువసార్లు స్నానం చేసినా శరీరంలోని అతి సూక్ష్మజీవవ్యవస్థను నష్టపరిచి మన రోగనిర

Advertiesment
shower
హైదరాబాద్ , శనివారం, 28 జనవరి 2017 (06:34 IST)
ప్రతిరోజూ స్నానం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని, శుభ్రంగా ఉంటామని మనం నమ్ముతాం. కాని దీనిపై రెండో ఆలోచన కూడా చేస్తే మంచిదంటోంది కొత్త సర్వే. అతిగా శరీరాన్ని శుభ్రం చేసినా, ఎక్కువసార్లు స్నానం చేసినా శరీరంలోని అతి సూక్ష్మజీవవ్యవస్థను నష్టపరిచి మన రోగనిరోధక, జీర్ణ వ్యవస్థలను దెబ్బతీస్తాయని తద్వారా గుండెకు కూడా చేటు తెస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
కొద్ది రోజులు మనం స్నానం చేయకపోతే దుర్వాసన వస్తుంది. కాని అతిగా స్నానం చేస్తే అది శరీరానికి మంచి కంటే ఎక్కువగా చెరుపు చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకి చెందిన జెనెటిక్ సైన్స్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. అతిగా స్నానం చేసినా, శరీరాన్ని శుభ్రపర్చుకున్నా అది మానవ మైక్రో బియోమ్ (బాక్టీరియా, వైరస్, శరీరానికి అంటిపెట్టుకుని ఉండే సూక్ష్మ జీవుల కలెక్షన్)ను దెబ్బతీస్తుందని చెప్పారు. 
 
ఈ మైక్రోబియోమ్ మనిషి ఆరోగ్యానికి అత్యవసరం. ఎక్కువగా స్నానం చేయడం, పదేపదే పరిశుభ్రం చేయడం చేస్తే ఈ సూక్ష్మ జీవ పర్యావరణ వ్యవస్థకు హాని కలుగుతుందని దీంతో రోగనిరోధక వ్యవస్థ, జీర్ణవ్యవస్థ, చివరకు గుండె కూడా దెబ్బతింటాయని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. 
 
అమెజాన్ లోని యనోమమి గ్రామంలో చేసిన పరిశోధన బట్టి అక్కడ నివసిస్తున్న ప్రజల చర్మంలో సమృద్ధగా సూక్ష్మ జీవ వ్యవస్థ ఉండటం కనిపించిందని, వీరిలో వైవిధ్యపూరితమైన బాక్టీరీయా, జన్యు వ్యవస్థ ఏర్పడి ఉందని పరిశోధకులు తెలిపారు. అదే షాంపూలు తరచుగా వాడే జీవన శైలి ఉన్న ప్రాంతాల్లో మానవ సూక్ష్మజీవ వ్యవస్థ లోని వైవిధ్యం దెబ్బతిన్నట్లు తేలింది. 
 
అలాగని స్నానం చేయడం పూర్తిగా ఆపినా సమస్యేనని, అయితే ఇప్పటికే అలా స్నానం పూర్తిగా ఆపివేసిన వారు ఉన్నారని ఈ పరిశోధన తెలిపింది. ఈ సందర్భంగా ది అట్లాంటిక్ పత్రిక సీనియర్ ఎడిటర్ జేమ్స్ హాంబ్లిన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. స్నానం చేయడం ఆపివేశాక నా చర్మం జిడ్డోడుతూ, వాసన వేస్తూఉండింది. కాని నా శరీరం దీనికి సర్దుబాటు కావటం మొదలయ్యాక ఈ ఫీలింగ్ తనకు కలగలేదని చెప్పారు.
 
స్నానం మానివేసి కొంత కాలం గడిచిన తర్వాత మన దేహ పర్యావరణ వ్యవస్థ ఒక స్థిర స్థితికి చేరుకుంటుందని అటుపై మన శరీరం పెద్దగా వాసన వేయదని  జేమ్స్ చెప్పారు. అలాగని మీ ఒళ్లు రోజ్ వాటర్ లేదా ఆక్స్ బాడీ స్ప్రే వాసనను తలపింప చేయదని అలాగని స్నానం చేయని జంతువు వాసన కూడా వేయదని హాస్యమాడారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంధాలను తెగ్గొట్టే నిద్రలేమి... జాగ్రత్త... ఏం చేయాలి?