అల్లం. ఈ అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యాన్ని కలుగుజేస్తుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా అల్లాన్ని దూరంగా పెట్టాలి. అల్లం ఎవరు తినకూడదో, ఎందుకు తినకూడదో తెలుసుకుందాము. బాగా సన్నగా వున్నవారు అల్లాన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెప్తారు. గర్భధారణ సమయంలో అల్లం తినడం మంచిది కాదంటారు.
రక్త సంబంధిత సమస్యలు ఉంటే అల్లం తీసుకోవడం మానుకోవాలి. పిత్తాశయ రాళ్లు ఉన్నవారు అల్లం తినడం మానుకోవాలని చెపుతారు. శస్త్రచికిత్సకు ముందు అల్లం తినవద్దని సూచనలున్నాయి. అల్లం ఎక్కువగా తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి.
అల్లం కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది, గుండెల్లో మంటను కలిగిస్తుంది. అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. అల్లానికి వేడి చేసే గుణం వున్నందున ఇది జీర్ణ సంబంధ వ్యాధులకు గురి చేస్తుంది.