Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయాన్నే నిమ్మకాయ రసాన్ని తాగితే ఫలితం ఏంటి?

Advertiesment
ఉదయాన్నే నిమ్మకాయ రసాన్ని తాగితే ఫలితం ఏంటి?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (17:10 IST)
మలబద్దకాన్ని నివారించడానికి కొంతమంది రోజూ ఉదయం నిమ్మకాయ నీటిని తాగుతారు. ప్రతిరోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది.
 
నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పల్చగా చేసిన మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలుపుకుని తాగితే నీరసం తగ్గి హుషారుగా ఉంటుంది.
 
నిమ్మకాయలు అధికంగా దొరికే ఈ కాలంలో పది నిమ్మకాయలను రసం పిండి దాంట్లో 100 గ్రాముల అల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి వేయాలి. సరిపడినంత ఉప్పు, జీలకర్ర కూడా నిమ్మరసంలో కలపాలి. వాటిని మూడురోజులు ఒక సీసాలో వేసుకుని నోరు వికారంగా ఉన్నప్పుడు ఒక అల్లం ముక్క నోట్లో వేసుకుని నమలడం వల్ల వికారం తగ్గుతుంది.
 
నిమ్మకాయ వల్ల ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకున్నాము. మరి నిమ్మతొక్కలు కూడా ఔషదంగా ఉపయోగపడతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. అవేంటో తెలుసుకుందాం.
 
నిమ్మతొక్కల్ని ఎండబెట్టి మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి ఉంచుకుని, అవసరమైనప్పుడు ఈ పొడిలో తగినన్ని పాలు కలిపి ముఖానికి పట్టించి గంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఖరీదైన బ్యూటీక్రీములకు బదులు ఈ వైద్యంతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
 
ఇరవై అయిదు గ్రాముల నిమ్మతొక్కలపొడి, వందగ్రాముల వంట సోడా, వంద గ్రాముల ఉప్పు కలిపి నూరి నిల్వ ఉంచుకుని దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తుంటే పళ్ల మీద గార తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తహీనత వున్నవారు నల్లనువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే?