Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నగా వున్నవారు మామిడి పండ్లు తింటే ఏమవుతుంది?

Mango
, శుక్రవారం, 6 మే 2022 (22:06 IST)
వేసవి రాగానే మనకు మార్కెట్లో కనిపించేవి మామిడిపండ్లు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక కప్పు (165 గ్రాములు) తాజా మామిడి 100 కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీ సాంద్రతను కలిగి ఉంటుంది, అంటే అది అందించే ఆహార పరిమాణంలో ఇది కొన్ని కేలరీలు కలిగి ఉంటుంది. 

 
నిజానికి, చాలా తాజా పండ్లు- కూరగాయలు తక్కువ కేలరీల సాంద్రతను కలిగి ఉంటాయి. భోజనం ప్రారంభంలో మామిడి వంటి తాజా పండ్లను తీసుకోవడం వలన భోజనం తర్వాత అతిగా తినకుండా ఉండవచ్చని అధ్యయనంలో తేలింది.

 
ఈ పండులో వుండే విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. వృద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. శృంగారంలో ఆసక్తి లేనివారికి శృంగార వాంఛను కలిగిస్తుంది.

 
మామిడిపండులో శరారంలోని రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్దం సమృద్దిగా ఉంది, ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది. మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉంటుంది.

 
మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది. దానిలో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌ వుంచుతున్నారా?