Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

60 యేళ్లు పైబడినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Advertiesment
60 యేళ్లు పైబడినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
, ఆదివారం, 21 అక్టోబరు 2018 (13:44 IST)
వచ్చిపడుతున్న జబ్బులకు ఆహారపు అలవాట్లే చాలావరకు కారణం. చాలా మంది కడుపు నిండా తిన్నామా, లేదా అనే విషయాన్ని చూస్తారే తప్ప ఏం తింటున్నామనే విషయంపై దృష్టిసారించరు. ఫ్యాటీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌పై ఉన్న మక్కువ ఫైబర్‌ ఫుడ్‌పై ఉండటం లేదు. నిజానికి అన్ని వయసుల వారు ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదని అంటున్నారు నిపుణులు. 
 
వయసు పైబడుతున్నప్పుడు ఆహార నియమాల్లో తేడా స్పష్టంగా ఉండాలని అంటున్నారు. ముఖ్యంగా, ఆరు పదుల వయసు దాటినవారు మాత్రం ఖచ్చితంగా విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను ఆరగించాలని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు.
 
సుమారు 60 ఏళ్లు పైబడిన వారికి విటమిన్స్‌ అత్యవసరం. వయసు పైబడుతున్న కొద్దీ చూపు మందగిస్తుంది. రుచి, వాసన, గ్రహణ శక్తి తగ్గిపోతుంది. జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. రకరకాల సమస్యలకు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో విటమిన్ల కొరత రాకుండా చూసుకోవాలి. 
 
ఫైబర్‌ : జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకం, పైల్స్‌ వంటి సమస్యలు ఈ వయసువారిలో సాధారణంగా కనిపిస్తాయి. అందుకే ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. పండ్లు తినాలి. 
 
విటమిన్లు : మాంసాహారం, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, దాన్యాలలో విటమిన్‌ బి12 ఉంటుంది. 
 
ఉప్పు : ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానుకోవాలి. మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారానికి ఎన్ని గ్రాముల పిస్తా పప్పులు తినవచ్చో తెలుసా?