Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూడుల్స్‌ తింటే లాభమా? నష్టమా? ముఖ్యంగా పిల్లలు తినొచ్చా?

Advertiesment
Instant Noodles
, శుక్రవారం, 16 అక్టోబరు 2015 (17:41 IST)
నూడుల్స్ అంటే పిల్లలు ఇష్టపడి తింటారు. పులుపు, ఉప్పు, కారంతో కూడిన నూడుల్స్‌ను ఆస్వాదిస్తూ తినడం పిల్లలకు అలవాటు. ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఈ నూడుల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే ట్రాన్స్ అనే కొవ్వు పదార్ధం, ఉప్పు, పంచదార అధికంగా నిండి ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. 
 
కొన్ని సంస్థలు ఫ్రైడ్ చికెన్‌ను రెడీమేడ్‌గా అందిస్తున్నాయి. ఆ సంస్థలు తమ ప్రకటనల్లో కొవ్వు లేనిది, ఎటువంటి మిశ్రమాలూ లేని సహజసిద్ధమైనదనీ, పైగా వంద శాతం పోషక విలువలు కలిగినదని అనేక అబద్ధాలు చెప్పి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 
 
ఆ సంస్థల ఉత్పత్తులను పరిశోధన చేసినపుడు అందులో ట్రాన్స్ అనే కొవ్వు పదార్ధం, ఉప్పు, చక్కెర స్థాయిలు అత్యధికంగా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి పదార్థాలు పిల్లలు ఎక్కువ తినడం ద్వారా ఒబిసిటీ ముప్పు తప్పదు. కాబట్టి ఇటువంటి మిశ్రమ ఆహార పదార్ధాలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu