Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండే ఎండలు: అంబలి, సంగటి తప్పక తీసుకోండి.. రోజూ గ్లాసుడు రాగి జావ తీసుకుంటే?

ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే భయం భయంగా ఉంది కదూ.. అందుకే ఎండల్లో తిరిగే పనులను ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గించుకుంటే మంచిదంటున్నారు... ఆరోగ్య నిపుణులు. ఒకవేళ ఎ

Advertiesment
మండే ఎండలు: అంబలి, సంగటి తప్పక తీసుకోండి.. రోజూ గ్లాసుడు రాగి జావ తీసుకుంటే?
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (11:54 IST)
ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే భయం భయంగా ఉంది కదూ.. అందుకే ఎండల్లో తిరిగే పనులను ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గించుకుంటే మంచిదంటున్నారు... ఆరోగ్య నిపుణులు. ఒకవేళ ఎండల్లో తిరగాల్సిన నిర్భంధం ఏర్పడినప్పుడు.. తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 
సమ్మర్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా.. సంగటి, అంబలి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. జొన్నలు, రాగులతో చేసిన అంబలి లేదా సంగటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు, మినిరల్స్, అయోడిన్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎండల్లో తిరిగేవారి ఆరోగ్యానికి.. ఇంక ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే.. శరీరాన్ని వేసవి తాపం నుంచి దూరం చేసుకోవాలంటే.. సజ్జలు, జొన్నలు, రాగులతో చేసిన వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.
 
అంతేగాకుండా.. ఎండాకాలం రాగి జావ రోజూ ఒక కప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటు మూడు నుంచి నాలుగు లీటర్లు నీరు.. ద్రవ పదార్థాలు, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ ముక్కలు, పండ్లు తీసుకుంటూ వుండాలని వారు సూచిస్తున్నారు. అప్పుడే డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చునని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీరు ఎక్కువ తాగితే ఏమవుతుంది...?