Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు తగ్గాలా? భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి.. శృంగారంలో పాల్గొనండి..

బరువు తగ్గాలా? అయితే శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించేందుకు ఉపాయాలను అనుసరించండి. కొవ్వు పదార్థాలను తీసుకోకుండా, పోషకాహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురికాకూడదు. అలాగే భాగస్వాముల

Advertiesment
Love and Weight Loss: How to fall in Love to Lose Weight
, గురువారం, 17 నవంబరు 2016 (10:41 IST)
బరువు తగ్గాలా? అయితే శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించేందుకు ఉపాయాలను అనుసరించండి. కొవ్వు పదార్థాలను తీసుకోకుండా, పోషకాహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురికాకూడదు. అలాగే భాగస్వాముల మధ్య ప్రేమ ఉండాలి. భాగస్వాముల మధ్య అనుబంధం బలంగా ఉంటే బరువు తగ్గడం సులభమైన పని అంటున్నారు మానసిక నిపుణులు. 
 
మనస్సు ప్రశాంతంగా ఉంటే.. ఒత్తిడి దూరమైతే బరువు పెరిగే ఆస్కారులుండవు. ఉదాహరణకు ప్రేమగా శృంగారంలో పాల్గొనటం వలన శరీరంలో కొవ్వు నిల్వలను బర్న్ చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా, ప్రతి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వేడి నీరు త్రాగటం వలన శరీరంలో కొవ్వు నిల్వలను బాగా తగ్గిస్తుంది. 
 
అలాగే బరువు తగ్గాలంటే.. అల్పాహారం తర్వాత ఒక మఫిన్ లేదా తీపి వంటకం తింటే సరిపోతుంది. ఇది రోజంతా తియ్యటి కోరికలను నియంత్రిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచడం ద్వారా మీ నిరోధక వ్యవస్థ పెంపొందుతుంది. చాలినంత నిద్ర పోకపోవటం కూడా బరువు పెరగటానికి కారణమవుతుంది. కాబట్టి చాలినంత నిద్ర పొండి. నిద్రలేమి వలన శరీరంలో ఇన్సులిన్ బరువు పెరగటానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అంతేగాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రకృతిని ఆస్వాదించండి. భాగస్వామితో ఆనందాన్ని పంచుకోండి. ఇష్టమైన వారితో సంతోషంగా మాట్లాడేందుకు పావు గంటైనా కేటాయించండి. అప్పుడు బరువు తగ్గడం చాలా సులభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఉసిరికాయ.. రోజూ ఓ ఉసిరికాయ తింటే..?